మృతుడిది కొత్తపూడివలసగా గుర్తింపు
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:40 PM
బొంతుపేట వద్ద పంట పొలాల్లో ఈనెల 13న పోలీసులకు లభ్యమైన మృతదేహం ఆచూకీ ఆదివారం తెలిసింది.
లావేరు, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): బొంతుపేట వద్ద పంట పొలాల్లో ఈనెల 13న పోలీసులకు లభ్యమైన మృతదేహం ఆచూకీ ఆదివారం తెలిసింది. మృతుడు ఎచ్చెర్ల మండలం కొత్తపూడివలసకు చెందిన కుప్పిశెట్టి కనకయ్య (79)గా గుర్తించారు. కనకయ్యకు మతిస్థిమితం లేదని, తరచూ ఇంటి నుంచి బ యటకు వెళ్లిపోతుంటాడని భార్య మహాలక్ష్మి పోలీసులకు తెలి పింది. గత నెల 31న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. మృతుడికి భార్య, కుమా రుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమా ర్టం నిర్వహించినట్టు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు.