ఆమదాలవలసకు చెందిన హమాలీ మృతి
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:04 AM
మునిసిపాలిటీ పరిధిలోని 19వ వార్డు పాత ఆమదాలవలస గ్రామానికి చెందిన హమాలీ పల్లి తారకేశ్వరరావు(36) మృతి చెందాడు.
ఆమదాలవలస, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని 19వ వార్డు పాత ఆమదాలవలస గ్రామానికి చెందిన హమాలీ పల్లి తారకేశ్వరరావు(36) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లే.. పార్వతీపురం మన్యం జిల్లా గంగాపురం పంచాయతీ హిందూపురం కూడలి వద్ద మంగళవారం పశువుల దాణాను అన్‌లోడ్ చేస్తుండగా లారీపై నుంచి జారిపడి మృతి చెందాడు. పట్టణంలోని ఓ కంపెనీ డెయిరీకి చెందిన పశువుల దాణా ఫ్యాక్టరీ నుంచి మన్యం జిల్లాలోని పలు ఆ కంపెనీకి చెందిన డెయిరీ కేంద్రాలకు దాణా సరఫరా చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తారకేశ్వరరావుకు భార్య పుష్పవతి, కుమారుడు తరుణ్‌కుమార్, కుమార్తె జాహ్నవి ఉన్నారు. పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పైడిభీమవరంలో వ్యక్తి ఆత్మహత్య
రణస్థలం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పైడిభీమవరం గ్రామానికి చెందిన సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. కొంత కాలంగా పురుషోత్తం గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఆచారి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఆచారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలుసులు కేసు నమోదు చేశారు.