Share News

భవానీ మాల ధరించిన రోజే..

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:38 AM

బొంతలకోడూరు వీఆర్‌ఏ బొంతల నర్సింహులు(45) విద్యుదాఘాతంతో మంగళవారం మృతిచెందాడు.

భవానీ మాల ధరించిన రోజే..

  • విద్యుదాఘాతంతో వీఆర్‌ఏ మృతి

ఎచ్చెర్ల, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): బొంతలకోడూరు వీఆర్‌ఏ బొంతల నర్సింహులు(45) విద్యుదాఘాతంతో మంగళవారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నర్సింహులు సోమవారం రాత్రి తుఫాన్‌ విధుల్లో ఉన్నాడు. మంగళవారం ఉదయం భవానీమాల ధరించి గ్రామంలోని సన్నిధానం వద్దకు వెళ్లారు. అక్కడ గేటును తాకాడు.. అయితే ఆ గేటుకు విద్యుత్‌ వైరు ఉండడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే తోటి భవానీ భక్తులు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. భవానీమాల ధరించిన రోజునే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. నర్సింహులకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్‌ఏ మృతిపై తహసీల్దార్‌ బి.గోపాల్‌, రెవెన్యూ సిబ్బంది సంతాపం తెలిపారు.

గుల్లవానిపేటలో ఒకరు..

పోలాకి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): విద్యాదాఘాతంలో గుల్లవానిపేట గ్రామానికి చెందిన కారి రామచంద్రరావు (41) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మే రకు.. దీపావళి పండగ సందర్భంగా తన ఇంటిపై ఏర్పాటు చేసిన సీరియల్‌ సెట్‌ లైట్లను తొలగించేందుకు మంగళవారం మేడపైకి వెళ్లాడు. వాటిని తొలగిస్తున్న క్రమంలో పక్క నుంచి వెళ్తున్న విద్యుత్‌ వైర్లకు తగిలి విద్యా దాఘాతానికి గురయ్యాడు. గాయపడిన రామచంద్రరావు ను భార్య మమత గ్రామస్థుల సాయంతో 108 వాహనంలో నరసన్నపేట ఏరి యా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామచం ద్రరావుకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Updated Date - Oct 29 , 2025 | 12:38 AM