తండ్రి చితికి తలకొరివి పెట్టిన కుమార్తె
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:15 AM
నందికొండ గ్రామంలో బుధవారం తం డ్రి చితికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన చోటు చేసుకుంది.
సరుబుజ్జిలి, జూలై 30(ఆంధ్రజ్యోతి): నందికొండ గ్రామంలో బుధవారం తం డ్రి చితికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెం దిన కూన సింహాచలం (65) కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈయ నకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు వైకుంఠరావు కూడా ఇటీవల ఇదే వ్యాధి బారినపడ్డాడు. ఈ క్రమంలో సింహాచలం బుధవారం మృతి చెందడంతో అంత్యక్రియలు చేసే స్థితిలో కుమారుడు లేకపోవడంతో చిన్న కుమార్తె అనురాధ (పురుషోత్తపురం) తండ్రి చితికి తలకొరివి పెట్టింది.