Share News

తండ్రికి తలకొరివిపెట్టిన కుమార్తె

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:30 PM

మండలంలోని శ్యామలాపురంలో మంగ ళవారం తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శ్యామలాపురానికిచెందిన ఇప్పిలి జగదీశ్వరరావు(49) ఆదివారం సాయంత్రం పాముకాటుకుగురై మృతి చెందాడు.జగదీశ్వరరావుకు భార్య భాను మతి, కుమార్తె లావణ్య ఉన్నారు.

  తండ్రికి తలకొరివిపెట్టిన కుమార్తె
తలకొరివిపెడుతున్న లావణ్య:

ఎల్‌.ఎన్‌.పేట, జూలై 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్యామలాపురంలో మంగ ళవారం తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శ్యామలాపురానికిచెందిన ఇప్పిలి జగదీశ్వరరావు(49) ఆదివారం సాయంత్రం పాముకాటుకుగురై మృతి చెందాడు.జగదీశ్వరరావుకు భార్య భాను మతి, కుమార్తె లావణ్య ఉన్నారు. రెండేళ్ల కిందట కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమార్తెకు వివాహం కావడంతో భర్తతో లండన్‌లో ఉంటోంది. జగదీశ్వరరావు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న లావణ్య భర్తతో సోమవారం రాత్రికి గ్రామానికి చేరుకొని మంగళవారం అంత్యక్రియలు నిర్వహించింది.

Updated Date - Jul 15 , 2025 | 11:30 PM