ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:47 PM
ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజీపీ మండలాధ్యక్షుడు పైల విష్ణుమూర్తి తెలిపారు. గురువారం ఆనందపురం, ఆబోతులపేట, దవళపేట, వాడ్రంగి గ్రామాల్లో బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సూచనలతో సేవా పక్షోత్సవాలు నిర్వహించారు.
జి.సిగడాం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజీపీ మండలాధ్యక్షుడు పైల విష్ణుమూర్తి తెలిపారు. గురువారం ఆనందపురం, ఆబోతులపేట, దవళపేట, వాడ్రంగి గ్రామాల్లో బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సూచనలతో సేవా పక్షోత్సవాలు నిర్వహించారు.అనంతరం దవళపేటకు చెందిన విశ్రాంత సైనికులను సన్మానించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ కోకన్వీనర్ సంపతిరావు నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మజ్జిపర్తి రఘురాం, నాయకులు బూరాడ వెంకట రమణ, సాకేటి నాగరాజు, ముద్దాడ గౌరిశ్వర రావు, పాండూరి అప్పారావు, గట్టెం అప్పలరాజు, బోట్ల భాస్కరరావు, పొగిరి దాశరధి, మీసాల రామకృష్ణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.