చిన్నారుల ప్రదర్శనలు అభినందనీయం
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:57 PM
నేటి ఆధునిక యుగంలో మన సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చిన్నారులు ఆధ్యాత్మిక ప్రదర్శనలు అభినం దనీయమని డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు అన్నారు.
అరసవల్లి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): నేటి ఆధునిక యుగంలో మన సంస్కృ తీ, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చిన్నారులు ఆధ్యాత్మిక ప్రదర్శనలు అభినం దనీయమని డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు అన్నారు. స్థానిక బాపూజీ కళా మందిర్ లో ఆరోహి సంగీత పాఠశాల విద్యార్థుల భక్తి సంగీత విభావరి శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే శాస్త్రీ య సంగీతం అభ్యసిస్తూ భక్తిభావం అలవరచుకుని జీవితంలో గొప్పగా ఎదగా లన్నారు. తొలి శాస్త్రీయ సంగీత ప్రదర్శన చేసిన ఆర్యమిత్రకు జ్ఞాపిక అందించి అభినందించారు. కార్యక్రమంలో సీటీవో రాణీమోహన్, డా.మాలతి, సంగీత పాఠశాల ప్రిన్సిపాల్ పెంకి నాగేశ్వరరావు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.