Share News

కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవాలి

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:08 PM

శ్రీకాకుళంలోని జిల్లా కేంద్ర గ్రంథాల యాన్ని అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవాలి
కేంద్ర గ్రంథాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

అరసవల్లి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని జిల్లా కేంద్ర గ్రంథాల యాన్ని అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.విద్యార్థులకు పోటీపరీక్షలు, అధ్య యనానికి నిలయంగా ఉన్న కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు. ఆది వారం శ్రీకాకుళంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట గ్రంథాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ ఆస్తులను అభివృద్ధి పేరుతో అన్యాక్రాంతం చేయవద్దని, ఆ ప్రయ త్నాలను విరమించుకోకపోతే ప్రజల మద్దతుతో పోరాటాలు చేస్తామని హెచ్చరిం చారు. బయట డబ్బులు చెల్లించి చదువుకోలేని నిరుద్యోగ యువతకు గ్రంథాల యం ఎంతోగానో ఉపయోగపడుతోందని తెలిపారు. వెనుక ఉన్న ఖాళీ స్థలంలో అదనపు భవనాలను నిర్మించి ఆధునీకరించాలని డిమాండ్‌చేశారు. డీఎస్సీతో పాటు త్వరలో పోటీ పరీక్షలు జరగనున్న తరుణంలో భవనాన్ని కూల్చివేస్తే, నిరుద్యోగులు, విద్యార్థులకు శాపంగా మారుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయపరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కరణం బుచ్చి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తమరివైకుంఠరావు, గరిమెళ్ల విజ్ఞానకేంద్రం అధ్యక్ష,కార్యదర్శులు ఎం. ప్రభాకర్‌, పి.సుధాకర్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, తంగా ఎర్రమ్మ, ఎం.గోవర్థనరావు, పి.వెంకటరావు, కొత్తకోట అప్పారావు, చలపతిరావు, ఎం.శ్రీనివాసరావు, గొంటి గిరిధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:08 PM