Share News

పొదలు అల్లుకొని.. పిచ్చి మొక్కలు పెరిగి

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:01 AM

:మండలంలోని గూనభద్ర పంచాయతీలో చెత్తసంపద కేంద్రం ఆవరణలో పొదలు అల్లుకుపోయి, పిచ్చిమొక్కలతో నిండిపోవడం తో అడవిని తలపిస్తోంది.అలికాం-బత్తిలిప్రధానరహదారికి ఆనుకొనిఉన్న ఈచెత్త సంపద తయారీ కేంద్రం చుట్టూ ముళ్లపొదలు, చెట్లు, పొదలు, ఆకులు అలములతో నిండి ఉండడంతో చూసేవారికి భయంగొల్పిస్తోంది.

పొదలు అల్లుకొని.. పిచ్చి మొక్కలు పెరిగి
చెత్తసంపద కేంద్రం ఆవరణలో అల్లుకుపోయిన ముళ్లపొదలు:

కొత్తూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి):మండలంలోని గూనభద్ర పంచాయతీలో చెత్తసంపద కేంద్రం ఆవరణలో పొదలు అల్లుకుపోయి, పిచ్చిమొక్కలతో నిండిపోవడం తో అడవిని తలపిస్తోంది.అలికాం-బత్తిలిప్రధానరహదారికి ఆనుకొనిఉన్న ఈచెత్త సంపద తయారీ కేంద్రం చుట్టూ ముళ్లపొదలు, చెట్లు, పొదలు, ఆకులు అలములతో నిండి ఉండడంతో చూసేవారికి భయంగొల్పిస్తోంది. ఇక చెత్త సేకరణ చేసేవారు ఈ సంపద తయారీ కేంద్రం పరిసరాల్లోకి వెళ్లేదాఖలాలులేవు. స్వచ్ఛాంధ్ర పేరుతో ప్రజలను చైత న్యంచేశామని చెప్పే అధికారులు చెత్త సంపద కేంద్రం వైపు కన్నెత్తి చూడడంలేదని చెప్పడానికి గూనభద్ర చెత్తసంపద కేంద్రమే ఉదాహరణనని పలు వురు చెబుతున్నారు.ఇప్పటికైన అధికారులు మొద్దునిద్ర నుంచి చెత్త సంపద కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:01 AM