అందరి మనసుల్లో బాలుకి చిరస్థానం
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:54 PM
బాలు పాటలు ఎన్నటికీ చిరస్మరణీయాలని రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహనరావు అన్నారు.
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బాలు పాటలు ఎన్నటికీ చిరస్మరణీయాలని రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహనరావు అన్నారు. ఈనెల 25న ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం వర్ధంతి సందర్భంగా శనివారం ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని స్వరాత్మిక సంగీత విద్యాపీఠం ఆధ్వర్యం లో స్థానిక బాపూజీ కళామందిరంలో నిర్వహించారు. బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలు అనేక చిత్రాల్లో పసం దైన గీతాలను ఆలపించి అందరి మనసులను దోచుకున్నార న్నారు. ఆయన పాటలతో ఎందరో గాయనీ గాయకులు శిక్షణ పొంది ఆలపిస్తున్నారన్నారు. అనంతరం కేఎల్‌ఎన్ మూర్తి, ఉమామహేశ్వరరావు, శ్రీనివాస్, మంగవేణి తదిత రులు బాలు పాటలను ఆలపించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవ స్థాపకుడు కేవీ ఉమా మహేశ్వరరావు, సంగీత విద్యాపీఠం నిర్వాహకుడు సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ, నిక్కు అప్పన్న, ముద్దాడ అప్పలనాయుడు, మిమిక్రీ కళాకారుడు నందికేశ్వర రావు, బాలయ్య పంతులు, మావుడూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.