Share News

స్వగ్రామానికి చేరుకున్న రాజు మృతదేహం

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:13 AM

గతనెల 26న తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన గుంట రాజు(25) మృతదేహం బుధవారం అతడి స్వగ్రామం వీరరా మచంద్రపురానికి చేరుకుంది.

స్వగ్రామానికి చేరుకున్న రాజు మృతదేహం
రాజు మృతదేహం

పలాస రూరల్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): గతనెల 26న తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన గుంట రాజు(25) మృతదేహం బుధవారం అతడి స్వగ్రామం వీరరా మచంద్రపురానికి చేరుకుంది. గొప్పిలి గ్రామ సచివాలయంలో ఇంజనీర్‌ అసిస్టెంట్‌గా రాజు విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేరుకుని రాజు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అయ్యప్ప మాలధా రణలో భాగంగా రాజుతోపాటు ఆరుగురు కారులో శబరిమాల వెళ్లి అయ్యప్ప దర్శనం అనంతరం రామేశ్వరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, రాజు రామేశ్వరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

Updated Date - Dec 04 , 2025 | 12:13 AM