Share News

గ్రామానికి చేరిన మత్స్యకారుడి మృతదేహం

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:14 AM

హుకుంపేట గ్రామానికి చెందిన మ త్స్యకారుడు కారి రాజులు గోవా సముద్ర తీరంలో శుక్రవారం చేపలవేట చేస్తూ పడవబోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

గ్రామానికి చేరిన మత్స్యకారుడి మృతదేహం

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): హుకుంపేట గ్రామానికి చెందిన మ త్స్యకారుడు కారి రాజులు గోవా సముద్ర తీరంలో శుక్రవారం చేపలవేట చేస్తూ పడవబోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాజులు మృతదేఽహం ఆదివారం స్వగ్రామం హుకుంపేట చేరుకుంది. ఆ మేరకు కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. అందరితో సన్నిహితంగా ఉండే రాజులు ఆకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Aug 04 , 2025 | 12:14 AM