సముద్రంలో బోటు బోల్తా
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:16 AM
The boat capsized సముద్రంలో బోటు బోల్తాపడిన ఘటనలో రూ.15 లక్షల ఆస్తినష్టం సంభవించింది. అందులోని మత్స్యకారులు ఈదు కుంటూ సురక్షితంగా తీరానికి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మత్స్యకారులు సురక్షితం
రూ.15 లక్షల ఆస్తినష్టం
సోంపేట రూరల్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): సముద్రంలో బోటు బోల్తాపడిన ఘటనలో రూ.15 లక్షల ఆస్తినష్టం సంభవించింది. అందులోని మత్స్యకారులు ఈదు కుంటూ సురక్షితంగా తీరానికి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎకువూరు గ్రామానికి చెందిన 12 మంది మత్స్యకారులు ఆదివారం ఉదయం ఆరు గంటల సమ యంలో బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. వలలో చేపలు పడ్డాక సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తీరానికి వస్తుండగా పెద్దఎత్తున ఎగిసిపడిన అలలకు బోటులోకి నీరు చేరింది. దీంతో బోటు మునిగిపోయింది. అందులో ఉన్న మత్స్యకారులు కొండ గోపాల్, మైలపల్లి బాలరాజు, జి.దాసు, మైలపల్లి కూర్మారావు, బి. వెంకటరావు, కోలేటి వెంకటరావుతో పాటు మరో ఆరుగురు సముద్రంలో ఈదుకుంటూ సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. ఎక్స్‌కవేటర్ ద్వారా బోటును బయటకు లాగే ప్రయత్నం చేయగా సముద్రంలో ఆటుపోట్లు కారణంగా సాధ్యంకాలేదు. కొత్త టెక్నా లజీతో ఇటీవల ఈ బోటును తయారు చేశామని, సముద్రంలో మునిగిపోవడంతో సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని మత్స్యకారులు చెబుతున్నారు. అధికా రులు పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.