Share News

చెట్టును ఢీకొన్న బైక్‌.. యువకుడు మృతి

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:37 AM

అలికాం- బత్తిలి ప్రధానరోడ్డు శ్యామలాపురం జంక్షన్‌ సమీపాన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్‌పై వస్తున్న ఓ యువకుడు చెట్టును ఢీకొని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

చెట్టును ఢీకొన్న బైక్‌.. యువకుడు మృతి

ఎల్‌ఎన్‌ పేట, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): అలికాం- బత్తిలి ప్రధానరోడ్డు శ్యామలాపురం జంక్షన్‌ సమీపాన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్‌పై వస్తున్న ఓ యువకుడు చెట్టును ఢీకొని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సరుబుజ్జిలి పోలీసులు తెలిపిన వివరా ల మేరకు.. శ్యామలాపురం ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన ఎస్‌.యుగంధర్‌(25) తన ద్విచక్ర వాహనంపై సోమవా రం రాత్రి సినిమా చూసేందుకు హిరమండలం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించి, యుగంధర్‌ కుంటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలు సుకున్న తల్లిదండ్రులు ఆనందరావు, శ్యామలాంబ ఘటనా స్దలానికి చేరుకొని భోరున విలపించారు. వీరికి యుగంధర్‌తోపాటు ఒక కుమార్తె ఉంది. ఒక్కగానొ క్క కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణణాతీతం. ఆనందరావు ఫిర్యా దు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ చంద్రినాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

గాయపడిన వ్యకి..

పలాస రూరల్‌/ మెళియాపుట్టి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టి మండ లం పరశురాంపురం గ్రామానికి చెందిన సవర నాగేశ్వరరావు(32) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. సోమవారం రాత్రి టెక్కలి పట్నం నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా.. రేగలపాడు వద్ద అడ్డంగా వచ్చిన పశువులను ఢీకొని పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సమా చారంతో 108 వాహనంలో చికిత్స నిమి త్తం పలాస ఆసుపత్రికి.. అక్కడి నుంచి టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాగేశ్వ రావు కొన్నాళ్లగా వెలుగు కార్యాలయంలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే భార్య..

పోలాకి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ఎమ్మెల్యే డోల సీతారాములు భార్య, మాజీ సర్పంచ్‌ డోల విశాలాక్షి(70) సోమవారం రాత్రి వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఈమె 2006 నుంచి రెండుసార్లు సర్పంచ్‌గా సేవలందించారు. స్వగ్రామమైన డోలలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, తదితరులు డోల గ్రామానికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా సీతారాములు తొమిదేళ్ల కిందట చనిపోయారు. వీరికి ముగ్గురు కుమా రులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో డోల జగన్‌ డీసీసీబీ చైర్మన్‌గా గతంలో సేవలందించగా.. ఉదయ్‌కుమార్‌ ప్రస్తుతం సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ..

రణస్థలం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పైడిభీమవరంలోని ఓ పరిశ్రమ ఎదురుగా జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో పూసపాటి రేగ మండలం చోడమ్మఅగ్రహారం గ్రామానికి చెందిన శీల అచ్చీయమ్మ (53) మృతి చెందింది. జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. పైడిభీమవరంలోని ఓ పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్తున్న అచ్చీయమ్మను వెను క నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో అచ్చీయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.

Updated Date - Dec 31 , 2025 | 12:37 AM