Share News

నేత్రపర్వంగా ఎండల మల్లన్న కల్యాణం

ABN , Publish Date - May 31 , 2025 | 11:25 PM

ప్రసిద్ధ శైవక్షేత్రమైన రావివలస భ్రమరాంబిక సమేత ఎండల మల్లికార్జున స్వామి కల్యాణం నేత్ర పర్వంగా సాగింది.

నేత్రపర్వంగా ఎండల మల్లన్న కల్యాణం
టెక్కలి: కల్యాణంలో పాల్గొన్న భక్తులు

టెక్కలి, మే 31(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ శైవక్షేత్రమైన రావివలస భ్రమరాంబిక సమేత ఎండల మల్లికార్జున స్వామి కల్యాణం నేత్ర పర్వంగా సాగింది. ముందుగా తిరువీధి నిర్వ హించి స్వామికి అభిషేకాలు చేశారు. అర్చ కుల వేదమంత్రాలు, మేళతాళాల నడుమ కత్యాణాన్ని చేశారు. ఈ సందర్భంగా నిర్వ హించిన కోలాటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈవో జి.గురునాధరావు, ఎల్‌ఎల్‌ నాయుడు, బడే జగదీష్‌, నర్తు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వీరబ్రహ్మేంద్ర స్వామికి విశేష పూజలు

నందిగాం, మే 31(ఆంధ్రజ్యోతి): నంది గాంలో నూతనంగా నిర్మించిన మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మందిర ప్రారంభం, చిత్రపట ప్రతిష్ఠ కార్యక్రమం శని వారం జరిగింది. వీరబ్రహ్మేంద్ర విశ్వబ్రాహ్మ ణ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ పురో హితుడు తమిరె కరుణశ్రీ ఆచారి పర్య వేక్షణలో గ్రామంలోని దంపతులు విశేష పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.

ఘనంగా జడ్డమ్మతల్లి పండుగలు

పాతపట్నం, మే 31(ఆంధ్రజ్యోతి): చిన్న లోగిడి గ్రామంలో జడ్డమ్మతల్లి గ్రామదేవత పండు గలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ముర్రాటలతో మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి చల్లదనం చేశారు. 3వ తేదీ వరకు నిర్వహిం చనున్న పండుగల నేపథ్యంలో ఆలయంతో పాటు వీధులను విద్యుద్దీపాలతో అలంకరిం చారు. ప్రతి ఇల్లు బంధువులతో కళకళ లాడుతోంది.

Updated Date - May 31 , 2025 | 11:26 PM