20 ఏళ్లూ కూటమిదే అధికారం
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:53 PM
‘అసత్య ప్రచారాలతో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న వైసీపీ త్వరలో కనుమరుగవ్వడం ఖాయం.
- త్వరలో వైసీపీ గల్లంతు
-ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘అసత్య ప్రచారాలతో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న వైసీపీ త్వరలో కనుమరుగవ్వడం ఖాయం. మరో 20 ఏళ్లు కూటమిదే అధికారం’ అని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన స్త్రీశక్తి సమా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. సూపర్‌సిక్స్ హామీలో భాగంగా మహిళలకు రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు చెప్పారు. ఏడాది పాలనలో నియోజకవర్గంలో రూ.530 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. బూర్జ, సరుబుజ్జిలి మండలాల సరిహద్దు ప్రాంతంలో మన పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 వేల కోట్లతో 3,200 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొంతమంంది వైసీపీ పిల్ల సైకోలు పరిశ్రమలు, ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ఆర్థిక ఉగ్రవాది మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి త్వరలో జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. సమావేశానికి ముందు మహిళలతో కలిసి ఎమ్మెల్యే పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించా రు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర లీగల్‌సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసా గర్, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మొదలవలస రమేష్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాణ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా తదితరులు పాల్గొన్నారు.