Share News

నా భర్తపై చేసిన ఆరోపణలు నిరూపించాలి

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:24 PM

తన భర్తపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన ఆరోపణలు ఆధారా లతో నిరూపించాలని, లేకుంటే తన కార్యాలయానికి వచ్చి గుండు చేయించుకుని చెప్పుతో కొట్టుకుని క్షమా పణ చెప్పాలని ఎమ్మెల్యే గౌతు శిరీష డిమాండ్‌ చేశా రు.

 నా భర్తపై చేసిన ఆరోపణలు నిరూపించాలి
మాజీ మంత్రి అప్పలరాజు నిర్వహించిన ఔషధ కంపెనీ వివరాలు చూపిస్తున్న ఎమ్మెల్యే శిరీష

లేకుంటే గుండు చేయించుకుని క్షమాపణ చెప్పాలి

మాజీ మంత్రి అప్పలరాజుకు ఎమ్మెల్యే శిరీష డిమాండ్‌

పలాస, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): తన భర్తపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన ఆరోపణలు ఆధారా లతో నిరూపించాలని, లేకుంటే తన కార్యాలయానికి వచ్చి గుండు చేయించుకుని చెప్పుతో కొట్టుకుని క్షమా పణ చెప్పాలని ఎమ్మెల్యే గౌతు శిరీష డిమాండ్‌ చేశా రు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అప్పలరాజు ప్రశ్నలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఓటు వేసిన ప్రజలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. అవినీతి పార్టీ నుంచి పుట్టుకు వచ్చిన మాజీ మం త్రి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, వాటిని ఇంకా ఆపకపోవడం దారుణ మన్నారు. తన భర్తపై చేసిన నిరాధార ఆరోపణలు, వ్యాఖ్యలు నీ విజ్ఞతకే విడిచిపెడు తున్నానన్నారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న మాజీ మంత్రి నగరం నడిబొడ్డున రాజా లాడ్జి భవనాన్ని రూ.12 కోట్లకు ఎలా కొనుగోలు చేశారని, ఆ కిటుకు ప్రజలకు చెప్పాలన్నారు. బొడ్డపాడు ఎంఐజీ లే అవుట్‌ స్థలాల కొనుగోలులో 12 శాతం ముందస్తు కమీషన్‌ రైతుల వద్ద కొట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిం చారు. టీడీపీ యువనేత బడ్డ నాగరాజు ఇంటి ముందు ఉన్న రోడ్డును విరగొట్టేందుకు 400 మంది పోలీసులతో కాప లాకాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘన త మాజీ మంత్రికే దక్కుతుందని, చివరకు ఆయ నను హత్య చేయించేందుకు కూడా వెనుకాడలేదన్నా రు. హల్‌మార్కు నకిలీ మందులు అమ్మించారని, నల్ల బొడ్లూరు కొండలో కంకర అమ్ముకున్నారని ఆరోపిం చారు. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

ఏడాదిలో ఎంతో అభివృద్ధి

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలోనే నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. రూ.515 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిందని పేర్కొంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్రచీఫ్‌ పురందేశ్వరికి కృత జ్ఞతలు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి కొత్త పరిశ్రమలతో వేలా ది మందికి ఉపాధి అవ కాశాలు కల్పిస్తున్నామన్నారు. వంశధార ద్వారా సాగు నీరందించామని, ఆఫ్‌ షోర్‌కు రూ.110 కోట్లు నిధులు విడుదల చేయించామన్నారు. కిడ్నీ పరిశోధన కేంద్రం లో డయాలసిస్‌ యూనిట్లు, రూ.110 కోట్లతో ఇంటిం టికీ తాగునీటి పథకం, కాశీబుగ్గ ఫ్లైవోవర్‌ నిర్మాణం, పూడిలంక వారధికి అనుమతులు తీసుకువచ్చామ న్నారు. తాను చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నానని, ప్రజల ఆదరాభిమానాలతో ఏడాదిలోనే భారీస్థాయిలో నిధులు తీసుకువచ్చానన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:24 PM