Share News

పాడి రైతులను ఆదుకోవడమే ధ్యేయం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:52 PM

పాడి రైతులను అన్నివిధాల ఆదుకోవడమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు.గురువారం మబగాంలో పాడిరైతులకు ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల దాణాను పాడిరైతులకు పంపిణీచేశారు.

పాడి రైతులను ఆదుకోవడమే ధ్యేయం: ఎమ్మెల్యే
రైతులకు పశువులదాణా పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి :

పోలాకి, జూలై 3(ఆంధ్రజ్యోతి): పాడి రైతులను అన్నివిధాల ఆదుకోవడమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు.గురువారం మబగాంలో పాడిరైతులకు ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల దాణాను పాడిరైతులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 శాతం రాయితీపై 50కిలోల బస్తా రూ510లకే అందజేస్తున్నామన్నారు.కార్యక్రమంలో కాయరవి, వెలమలరమేష్‌, బి.పద్మప్రియ, ఎం.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:52 PM