యువతకు అవకాశాలు కల్పించడమే ధ్యేయం
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:39 AM
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
జలుమూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. చల్లవానిపేటలోని వంశధార డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించే మెగా జాబ్‌మేలో పాల్గొని వివిధ కంపెనీలకు ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే అవకాశాన్ని విడచిపెట్టకుండా ఉద్యోగంలో చేరి నైపుణ్యాన్ని పెంచుకొని ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలన్నారు. ఈ జాబ్ మేళాలో 375 మంది పాల్గొనగా.. 273 మంది 11 కంపెనీలకు ఎంపి కయ్యారు. వీరికి నియా మకపత్రాలు అందించారు. కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి సాయికుమార్, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, కరస్పాండెంట్ మధుబాబు, ప్రిన్సిపాల్ వి.శాంతారావు తదితరులు పాల్గొన్నారు.
- పోలాకి: తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు.