మెరుగైన రవాణా సౌకర్యమే లక్ష్యం
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:00 AM
ప్రజలకు మొరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
నరసన్నపేట, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మొరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. లుకలాం గ్రామంలో మంగళవారం లుకలాం టూ శ్రీకాకుళం వయా నరసన్నపేట ఆర్టీసీ పల్లెవెలుగు సర్వీసును ఆయన ప్రారంభించారు. నియోజవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, ఆర్టీసీ డీఎంతోపాటు టీడీపీ నాయకులు జల్లు చంద్రమౌళి, కేఎల్‌ఎన్ ప్రసాద్, శిమ్మ చంద్రశేఖర్, అడపా చంద్రశేఖర్, పూతి రమణ, ఆనంద్, ఎం.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే నరసన్నపేట పట్టణంలోని ఇండోర్ స్టేడియం లో రూ.49 లక్షలతో చేపట్టనున్న ఉడెన్ గ్రౌండ్ పనులకు శంకుస్థాపన చేశారు.