టీడీపీతోనే బలహీనవర్గాల అభ్యున్నతి
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:55 PM
టీడీపీతోనే బలహీనవర్గాల అభ్యున్నతిసాధ్యమని వ్యవసాయ, బీసీ సంక్షేమశాఖ మంత్రులు కింజరాపు అచ్చె న్నాయుడు, ఎస్.సవితలు తెలిపారు.
కోటబొమ్మాళి/టెక్కలి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీతోనే బలహీనవర్గాల అభ్యున్నతిసాధ్యమని వ్యవసాయ, బీసీ సంక్షేమశాఖ మంత్రులు కింజరాపు అచ్చె న్నాయుడు, ఎస్.సవితలు తెలిపారు. కులాల వారీగావృత్తుల ఆధారంగా పనిముట్లను గతంలో అందజేశామని చెప్పారు.మంగళవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లగా బోయిన గోవిందరాజులు, డోకి రాజేష్ ప్రమాణస్వీకారంచేశారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అనగారిన వర్గాల అభివృద్ధిని పాతరేసిందని ఆరోపించారు. కళింగ వైశ్య సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, డైరెక్టర్ డోకి రాజేష్ మాట్లాడుతూ కళింగ వైశ్యులను బీసీల్లో చేర్చిన ఘనత మంత్రి కింజరా పు అచ్చెన్నా యుడుదేనని, కళింగ కోమట్లను ఓబీసీల్లో చేర్పించేందుకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కృషి ప్రశంసనీయమని తెలిపారు.అనంతరం బోయిన గోవింద రాజులను గజమాలతో వారు సత్కరించారు.కళింగ కోమట్ల సంఘ, వర్తక సంఘ అధ్య క్షులు లాడిశ్రీనివాసరావు, మోనింగి గోవిందరావు, కోరాడ తిరుమల రావు, హేమసుం దర్, మద్ది రామకృష్ణ, పి.గణేష్ తదితరులు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, చైర్మన్ గోవిందరాజులనుసన్మానించారు. కార్యక్రమంలో బోయిన సత్య శ్రీనివాస్ పాల్గొన్నారు.