Share News

60 మంది కార్మికులను చేర్చుకోవడం అభినందనీయం

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:41 PM

శ్యాంపిస్టన్స్‌లో గత కొంతకాలం కిందట తొలగించబడిన 60 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఆనందం గా ఉందని సీఐటీయూ పూర్త రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, పరిశ్ర మ కార్మిక సంఘం నేతలు అన్నారు.

60 మంది కార్మికులను చేర్చుకోవడం అభినందనీయం
ఐక్యత చాటుకున్న సీఐటీయూ, కార్మిక సంఘ నాయకులు

లావేరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): శ్యాంపిస్టన్స్‌లో గత కొంతకాలం కిందట తొలగించబడిన 60 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఆనందం గా ఉందని సీఐటీయూ పూర్త రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, పరిశ్ర మ కార్మిక సంఘం నేతలు అన్నారు. ఆదివారం బుడుమూరులోని ఓ కల్యాణ మండ పంలో శ్యాంపిస్టన్‌ పరిశ్రమ-3లో సీఐటీయూ సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన సీఐటీయూ నిలిచి పోరా డుతుందన్నారు. పరిశ్రమ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలి పారు. కార్యక్రమంలో నాయకులు పి.శ్రీను బాబు, దుర్గారావు, మహేష్‌, అప్పలనాయుడు, చక్రధర్‌, పలువురు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 11:41 PM