ఎమ్మెల్యే శిరీషపై ‘సీదిరి’ నిందారోపణలు సరికాదు
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:56 PM
మా సామాజికవర్గంలోని భార్యాభర్తల తగాదా విషయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిందారోపణలు చేయడం సరికా దని కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు అన్నారు.
శ్రీకాకుళం అర్బన్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మా సామాజికవర్గంలోని భార్యాభర్తల తగాదా విషయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిందారోపణలు చేయడం సరికా దని కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు అన్నారు. నగరం లోని కళింగ వైశ్య కల్యాణ మండపంలో బుధ వారం విలేకరులతో మాట్లాడుతూ.. భార్యాభర్త ల మధ్య వివాదం ఉందని పలాసకు చెందిన తంగుడు కవిత గతంలో వైసీపీ నాయకులు చుట్టూ తిరిగినప్పటికీ పరిష్కారం చూపలేద న్నారు. అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు ను ఆశ్రయించినా పట్టించుకోలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేయాలని తమ సామాజికవర్గంలో ఉన్న వైసీపీ, టీడీపీ పెద్దలందరితో పాటు ఎమ్మెల్యే శిరీషను కలిశారన్నారు. మానవత్వంతో శిరీష స్పందించి ఎస్పీతో పాటు ఇరువర్గాలతో చర్చించి కవితను అత్తవారింటికి పంపించా రన్నారు. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే శిరీషను దోషిగా చూపించాలన్న కుట్రతో అప్పలరాజు అవమానించేలా మాట్లాడడం తగదన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కళింగ కోమటి సంఘ నేతలు కోరాడ హరగోపాల్, జామి భీమశంకర్, అంధ వరపు ప్రసాద్, కోరాడ రమేష్, చైతన్య ప్రభు, పెదబాబు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.