Share News

12వ పీఆర్సీని నియమించాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:02 AM

:ఉద్యోగుల, పెన్షనర్లకు రావల్సిన బకాయిలు, వాటి వివరాలు వెంటనే పేస్లిప్పులు సీఎఫ్‌ఎంఎస్‌లో చూపించేలా చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అసోసియేట్‌ చైర్మన్‌ టీవీ ఫణిపేర్రాజు కోరారు.

 12వ పీఆర్సీని నియమించాలి
మాట్లాడుతున్న ఏపీజేఏసీ రాష్ట్ర నాయకుడు ఫణి పేర్రాజు

గుజరాతీపేట/ అరసవల్లి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి):ఉద్యోగుల, పెన్షనర్లకు రావల్సిన బకాయిలు, వాటి వివరాలు వెంటనే పేస్లిప్పులు సీఎఫ్‌ఎంఎస్‌లో చూపించేలా చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అసోసియేట్‌ చైర్మన్‌ టీవీ ఫణిపేర్రాజు కోరారు.12వ పీఆర్సీ నియమించాలని డిమాండ్‌చేశారు. శుక్రవారం శ్రీకాకుళంలోని రెవెన్యూ భవన్‌లో ఏపీజేఏసీ అమరావతి జిల్లా కమిటీ కార్య వర్గ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు విడుదలచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా చైర్మన్‌ శ్రీరాములు, క్లాస్‌-4ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.మల్లేశ్వరరావు, ఏపీజేఏసీ మహిళా విభాగం జిల్లా చైర్మన్‌ కె.ప్రవల్లిక ప్రియ, పొదిలాపుశ్రీను, భైరిరాజు, ఎస్‌.గోవిందరావు, జె.రామారావు, కాళీప్రసాద్‌, ఇతర అనుబంధ సంఘాల అధ్య క్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

డివిజన్‌ కమిటీల ఎన్నిక

శ్రీకాకుళం సిటీ, శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజనల్‌ కమిటీలను ఈ సంద ర్భంగా ఎన్నుకున్నారు. శ్రీకాకుళం డివిజన్‌ ఛైర్మన్‌గా ఎస్‌.గణపతిరావు, ప్రధాన కార్యదర్శిగా పి.రాజశేఖర్‌, టెక్కలి డివిజన్‌ ఛైర్మన్‌గా బి.హేమసుందర్‌, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎం.రావు, పలాస డివిజన్‌ ఛైర్మన్‌గా బి.అప్పలస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.పి.కుమార్‌, మహిళా విభాగానికి సంబంధించి శ్రీకాకుళం సిటీ యూనిట్‌ ఛైర్‌పర్సన్‌గా డి.అనూరాధ, ప్రధాన కార్యదర్శిగా బి.సుభద్ర, డివిజన్‌ చైర్మన్‌గా డి.వనజాక్షి, కార్యదర్శిగా పి.రాజేశ్వరి, టెక్కలి డివిజన్‌ ఛైర్మన్‌గా ఎస్‌.పవిత్ర, కార్యదర్శిగా ఎన్‌.అనూష, పలాస డివిజన్‌ ఛైర్మన్‌గా ఎస్‌.కరుణమ్మ, కార్యదర్శిగా బీఎస్‌ రాణి ఎన్నికయ్యారు.

Updated Date - Sep 06 , 2025 | 12:03 AM