Share News

ఆ వివాహిత చనిపోయింది..

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:01 AM

విభేదాల కారణంగా భర్త తనకు దూర మవుతాన్నడనే మనస్తాపంతో గురువా రం పురుగుల మందుతాగి పోలీసుస్టేషన్‌ వద్ద కుప్పకూలిపోయిన వివాహిత రా పాక రూపవతి చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ శుక్రవారం తెలి పారు.

ఆ వివాహిత చనిపోయింది..
చికిత్స పొందుతున్న రూపవతి(ఫైల్‌)

  • భర్త దూరమవుతున్నాడని.. పురుగుల మందు తాగిన మహిళ

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

పలాస, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): విభేదాల కారణంగా భర్త తనకు దూర మవుతాన్నడనే మనస్తాపంతో గురువా రం పురుగుల మందుతాగి పోలీసుస్టేషన్‌ వద్ద కుప్పకూలిపోయిన వివాహిత రా పాక రూపవతి చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్ప గించించినట్టు తెలిపారు. గొల్లమాకనపల్లి గ్రామానికి చెందిన రూపవతికి మం దస మండలం లింబుగాం గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు భాను తేజతో రెండున్నరేళ్ల కిందట వివాహం జరిగింది. తన భర్తతో పాటు అత్తమా మలు వేధిస్తున్నారని, దాడి కూడా చేశారని రూపవతి ఫిర్యాదు చేసింది. అనంత రం మార్కెట్‌కు వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి ఆమె అక్కడే తాగేసింది. అనంతరం పోలీస్టేషన్‌కు వచ్చి బయటే కుప్పకూలిపోయింది. దీంతో ఆమె పరిస్థి తి ఆందోళనకరంగా ఉండడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిం చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టే సీఐ తెలిపారు.

Updated Date - Sep 20 , 2025 | 12:01 AM