Share News

న్యాయస్థానంలో ‘థర్మల్‌’ పోరాటం

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:34 PM

Thermal Anti-Fighting Committee protest సరుబుజ్జిలి, బూర్జ మండలాల సరిహద్దు గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని థర్మల్‌ వ్యతిరేక పోరాట కమిటీ తీర్మానం చేసింది. మంగళవారం కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. సరు బుజ్జిలి మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు.

న్యాయస్థానంలో ‘థర్మల్‌’ పోరాటం
వెన్నెలవలసలో థర్మల్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుల వినూత్న నిరసన

కమిటీ తీర్మానం

పోలీసు వలయంలో థర్మల్‌ ప్రాంతం

సరుబుజ్జిలి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి, బూర్జ మండలాల సరిహద్దు గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని థర్మల్‌ వ్యతిరేక పోరాట కమిటీ తీర్మానం చేసింది. మంగళవారం కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. సరు బుజ్జిలి మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసీ ల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించడానికి పోరాట కమిటీ చర్యలు చేపట్టింది. అయితే ఎటువంటి అనుమతులు లేని పోరాట కమిటీ చర్యలను అడ్డుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీ సి.హెచ్‌.వివేకా నంద ఆధ్వర్యంలో సుమారు 250 మంది పోలీసులు మంగళవారం థర్మల్‌ ప్రతిపా దిత ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాల ను చుట్టుముట్టారు. సరుబుజ్జిలి తహసీ ల్దార్‌ కార్యాలయం నుంచి వెన్నెలవలస, అడ్డూరిపేట, బొడ్లపాడు, మశానపుట్టి తదితర గ్రామాల పరిసర ప్రాంతాల్లో పోలీసు పహారా ఏర్పా టు చేశారు. దీంతో చేసే ది లేక రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఉపా ధ్యక్షులు వాబ యోగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, రైతు కూలీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ఆధ్వ ర్యంలో వెన్నెలవలస గ్రామంలోనే నిరసన కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని పురుషులు, మహిళలు బాణాలు చేత పట్టి వినూత్న నిరసన తెలిపారు. అనంత రం ర్యాలీగా నాయకులు, నిరసనకారులు ముం దుకు వెళుతున్న సమయంలో ఆమదాలవలస సీఐ పి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వెన్నెలవలస గ్రామానికి చేరుకున్నారు. ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని.. శాంతియుతంగా నిరసన తెలుపుకోవడానికి అభ్యంతరం లేదని అన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు మాట్లాడుతూ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం అడ్డుకోవడంతో పాటు పోలీసులతో నిర్బంధానికి గురి చేస్తోందని ఆరోపించారు. దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. భవిష్యత్తులో భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడకుండా... సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మార్గాల ద్వారా ఉద్యోగాలు కల్పించాలన్నారు. అనంతరం సరుబుజ్జిలి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిప త్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్‌.కృష్ణవేణి, వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు బి.సురేష్‌దొర, కార్యదర్శి ఎస్‌.సింహాచలం, కోశాధికారి అత్తులూరి రవికాంత్‌, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:34 PM