థాంక్యూ సర్
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:43 PM
ఈ చిత్రంలో చిరునవ్వులు చిందిస్తున్న వ్యక్తిని గుర్తు పట్టారా? అవును.. ఆయన మన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్. పేరులోనే ‘దినకర్’డు (సూర్యు డు)ని ఉంచుకున్న ఆయన నిజంగానే రైతులకు వెలుగునిచ్చిన సూర్యుడయ్యారు.
కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీ
పలాస, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఈ చిత్రంలో చిరునవ్వులు చిందిస్తున్న వ్యక్తిని గుర్తు పట్టారా? అవును.. ఆయన మన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్. పేరులోనే ‘దినకర్’డు (సూర్యు డు)ని ఉంచుకున్న ఆయన నిజంగానే రైతులకు వెలుగునిచ్చిన సూర్యుడయ్యారు. అందుకే రాజకీయ నాయకుల వేడుకలను తలపించేలా పలాస-కాశీబుగ్గ జంట పట్టణా ల్లో అంత పెద్ద ఫ్లెక్సీ వెలసింది. ఫ్లెక్సీ పెట్టే టంత అభిమానానికి కారణం తెలియా లంటే.. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. పలాస-వజ్రపుకొత్తూరు మండలాల శివారు భూములకు వంశధార నీరు అందడం గగ నమే. గత ఐదేళ్లు చుక్కనీరు కూడా విడు దల చేయలేకపోయారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష.. కలెక్టర్‌కు వంశధార శివారు భూములకు ఉన్న నీటి సమస్యను వివరించారు. దీంతో శివారు భూములకు సాగునీటిని అందించే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. అక్కడితో ఆగలేదు. పంట పొలాలకు నీరు అందుతోందో.. లేదోనని వంశధార అధికారు లతో కలసి స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ కృషి ఫలితంగా ప్రస్తుతం వంశధార ఆయకట్టు భూముల్లో సిరులు పండాయి. కలెక్టర్ కృషి ఫలితంగా తాము ధాన్యం రాశు లు చూశామని.. అందుకే ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకుంటున్నామని నీటి వినియోగదారుల సంఘం (వంశధార) అధ్యక్షుడు గొనప నిరంజన్ విలేకరులకు తెలిపారు. ఆయనను ఎప్పటికీ మరచిపోలేమన్నారు.