Share News

under suspicious circumstances అనుమానాస్పద స్థితిలో వస్త్ర వ్యాపారి మృతి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:02 AM

under suspicious circumstances పొందూ రుకు చెందిన వస్త్రవ్యాపారి ఉండ్రాళ్ల కిషోర్‌ కుమా ర్‌(50) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.

under suspicious circumstances   అనుమానాస్పద స్థితిలో వస్త్ర వ్యాపారి మృతి

ధర్మపురం బావిలో మృతదేహం గుర్తింపు

పొందూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పొందూ రుకు చెందిన వస్త్రవ్యాపారి ఉండ్రాళ్ల కిషోర్‌ కుమా ర్‌(50) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ధర్మపురం సమీపంలోని ఓ బావిలో మృతదేహాన్ని బుధవారం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి కిశోర్‌కుమార్‌గా గుర్తించారు. కిశోర్‌ కుమార్‌ మంగళవారం రాత్రి ధర్మపురంలో బాకీలు వసూలుకు వెళ్లాడని, బావిలో పొరపాటున కాలుజారి పడిపోయి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. భార్య అనూష భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడి మృతి

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): హ రిశ్చంద్రపురం-తిలారు రైల్వే స్టేషన్‌ మధ్యలో బుధవారం రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ హెచ్‌సీ డి.హరినాథ్‌ తెలి పారు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని, తెల్లని గళ్ల షర్టు, నలు పు రంగు ఫ్యాంటు ధరించి చామనఛాయ రంగు కలిగి ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా మృతు డి వివరాలు తెలిస్తే 8985021143 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

కె.కపాసుకుద్దిలో విద్యార్థిని ఆత్మహత్య

కవిటి, ఏప్రిల్‌9(ఆంధ్రజ్యోతి): కె.కపాసుకుద్ది గ్రామానికి చెందిన విద్యార్థిని ఎస్‌.అపూర్వ(13) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. అపూర్వ తరచూ అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురవుతుండేది. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లి హేమలత గమనించి స్థానికుల సాయంలో ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతిచెందింది. తండ్రి కుమారస్వామి వలస కూలీగా పనిచేస్తున్నాడు. అపూర్వ తల్లితో ఉంటూ కవిటిలో ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లి హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 10 , 2025 | 12:02 AM