Share News

గంజాయి స్మగ్లర్లకు పదేళ్ల జైలు

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:59 PM

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్ల ర్లు శంకరన్‌ మిశ్రా, సరోజ్‌కుమార్‌ సాహులకు పదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా శ్రీకాకుళం కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు విధించినట్టు రైల్వే ఎస్‌ఐ కోటేశ్వ రరావు తెలిపారు.

గంజాయి స్మగ్లర్లకు పదేళ్ల జైలు

  • రూ.లక్ష జరిమానా

పలాస, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్ల ర్లు శంకరన్‌ మిశ్రా, సరోజ్‌కుమార్‌ సాహులకు పదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా శ్రీకాకుళం కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు విధించినట్టు రైల్వే ఎస్‌ఐ కోటేశ్వ రరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... 2024 సంవత్సరంలో వీరి ద్దరూ 42 కిలోల గంజాయితో రైలులో ప్రయాణించేందుకు యత్నిస్తుండగా అప్ప టి ఎస్‌ఐ షేక్‌షరీఫ్‌, సీఐ కె.వెంకటరావు వారిని అదుపులోకి తీసుకుని కేసు న మోదు చేశారు. దర్యాప్తు చేపట్టి శ్రీకాకుళం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయగా.. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయాధికారి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది కింజరాపు శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

Updated Date - Aug 29 , 2025 | 11:59 PM