Share News

దిలీప్‌ క్రికెట్‌ ట్రోఫీకి టెక్కలి యువకుడు ఎంపిక

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:16 AM

ప్రతిష్ఠాత్మకమైన దిలీ ప్‌ క్రికెట్‌ ట్రోఫీకి టె క్కలికి చెందిన యు వకుడు త్రిపురాన విజయ్‌ ఎంపికయ్యాడు.

దిలీప్‌ క్రికెట్‌ ట్రోఫీకి టెక్కలి యువకుడు ఎంపిక
త్రిపురాన విజయ్‌

టెక్కలి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకమైన దిలీ ప్‌ క్రికెట్‌ ట్రోఫీకి టె క్కలికి చెందిన యు వకుడు త్రిపురాన విజయ్‌ ఎంపిక య్యాడు. గత సీజన్‌ రంజీ మ్యాచ్‌ల్లో విజయ్‌ 26 వికెట్లు సాధించి సత్తాచాటా డు. రాజస్థాన్‌లో జరిగిన తొలిమ్యాచ్‌లో మొదటి ఇన్నిం గ్స్‌లో ఐదు వికేట్లు తీసి ఆంధ్రా విజయంలో కీలకపాత్ర పోషించి, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పొందాడు. ఆంధ్రా, హైదరాబాదు జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐదు వికె ట్లు, విదర్భ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. రంజీ మ్యాచ్‌ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా విజయ్‌ దిలీప్‌ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అలాగే సయ్యద్‌ ముస్తా క్‌ ఆలీ ట్రోఫీతో సహా పలు దేశ వాళీ క్రికెట్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. దక్షిణ భారత జట్టుకు రా ష్ట్రం నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహి స్తుండగా.. అందు లో విజయ్‌ ఒకరు కావడం విశేషం. ఈ ఏడాది ఐపీఎల్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఎంపికైన విజయ్‌.. గత నాలు గు సీజన్లగా ఆంధ్రా ప్రీమియం లీగ్‌లో రాణిస్తున్నాడు. 2025-26 సీజన్‌ దిలీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఈ నెల 28వ తేదీ నుంచి జరగనున్నాయి. జిల్లా నుంచి ప్రతిభ కనబ రుస్తున్న విజయ్‌కు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, జిల్లా క్రికెట్‌ సంఘ అధ్యక్ష, కార్యద ర్శులు పుల్లెల శాస్త్రి, షేక్‌ అసీన్‌ రాజా, మెంటార్‌ ఇలియాస్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - Aug 06 , 2025 | 12:16 AM