సుందరీకరణ దిశగా టెక్కలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:52 PM
నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిని మరింత సుందరీకరణ దిశగా కనిపించేందుకు మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు నడంబిగించారు.
మంత్రి అచ్చెన్న చొరవతో నిధులు మంజూరు
టెక్కలి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిని మరింత సుందరీకరణ దిశగా కనిపించేందుకు మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు నడంబిగించారు. ఇందులో భాగంగా శనివారం జగతిమెట్ట జంక్షన్ నుంచి డిగ్రీ కళాశాల, ఇందిరాగాంధీ కూడలి, హనుమాన్ జంక్షన్ వరకు కాలిన డకన సుడా ఎస్‌ఈ సుగుణాకరరావు, ఉద్యానవనశాఖ ఏడీ చింతాడ చంద్ర శేఖర్‌తో కలిసి పరిశీలించారు. జగతిమెట్ట నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఫుట్ పాత్, బ్యూటిఫికేషన్ చేపట్టాలని సుడా ఎస్‌ఈకి ఆదేశించారు. ఇందు కోసం రూ.25లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే పట్టుమహాదేవి కోనేరు గట్టు సుందీకరణ చేసేందుకు మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేయగా ఈ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా టెక్కలి సుందరీకరణకు అచ్చెన్నాయుడు దృష్టి సారించారు.