Share News

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్య

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:05 AM

Train stopped for two hours in Ponduru భువనేశ్వర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రైలు పొందూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపటి తర్వాత తిరిగి బయలుదేరే సమయంలో సాంకేతిక సమస్య కారణంగా ముందుకు కదలలేదు.

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్య

పొందూరులో రెండు గంటలు నిలిచిన రైలు

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

పొందూరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): భువనేశ్వర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రైలు పొందూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపటి తర్వాత తిరిగి బయలుదేరే సమయంలో సాంకేతిక సమస్య కారణంగా ముందుకు కదలలేదు. అలారం చైన్‌ఫుల్లింగ్‌ సమస్య కారణంగా రైలు సుమారు రెండున్నర గంటలకుపైగా స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు దిబ్రుగడ్‌ నుంచి కన్యాకుమారి వెళ్లే వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌, శ్రీకాకుళం నుంచి బెంగుళూరు వెళ్లే స్పెషల్‌ట్రైన్‌, ఈఎంయూ రైలు కూడా ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) స్టేషన్‌ సమీపంలో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. విజయనగరం నుంచి సాంకేతిక సిబ్బంది చేరుకుని సమస్యను పరిష్కరించారు. 4.30 గంటల సమయంలో రైలు తిరిగి బయలుదేరినట్లు స్టేషన్‌ మాస్టర్‌ జేవీ ఉమామహేశ్వరరావు తెలిపారు.

Updated Date - Nov 22 , 2025 | 12:06 AM