Share News

ఉపాధ్యాయులను బదిలీ చేసి జీతాలివ్వలేదు

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:50 PM

: ఉపాధ్యా యులకు ఇటీవల బదిలీలు చేశారని, అయితే నేటికీ జీతాలు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్‌ ఉపా ధ్యాయ సంఘం (ఆపస్‌) జిల్లా అధ్యక్షుడు దుప్పల శివరాం ప్రసాద్‌ అన్నారు.

 ఉపాధ్యాయులను బదిలీ చేసి జీతాలివ్వలేదు
మాట్లాడుతున్న ఆపస్‌ జిల్లా అధ్యక్షుడు శివరాం ప్రసాద్‌

అరసవల్లి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యా యులకు ఇటీవల బదిలీలు చేశారని, అయితే నేటికీ జీతాలు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్‌ ఉపా ధ్యాయ సంఘం (ఆపస్‌) జిల్లా అధ్యక్షుడు దుప్పల శివరాం ప్రసాద్‌ అన్నారు. స్థానిక సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. జీతాల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, తక్షణం స్పందించి పొజిషన్‌ ఐడీలు జారీ చేసి జీతాలు అందించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు యూని ఫారాలు, నోట్‌ బుక్స్‌, టీచర్లకు హ్యాండ్‌ బుక్స్‌ ఇప్పటికీ అనేక పాఠశాలలకు చేరలేదని, తక్షణం తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సంఘం పోలాకి మండల కార్యవర్గ ఎన్నిక నిర్వహిం చారు. అధ్యక్షుడిగా సింగుపురం రాజు, ప్రధాన కార్యదర్శిగా ఊడికల వేణుగోపాలరావులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పి.కాశీవిశ్వనాథ్‌, జి.చిన్ని కృష్ణం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:50 PM