టెట్ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:45 PM
ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, విద్యారంగ సమస్యలను పరి ష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు.
అరసవల్లి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, విద్యారంగ సమస్యలను పరి ష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే పార్కు వద్ద సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్. బాబూరావు ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని కోరారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులపై అధికారులు నిర్బంధాన్ని విధిస్తున్నారని, విద్యార్థుల మరణాలకు ఉపాధ్యా యులను బాధ్యులను చేయడం దారుణమన్నారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా బోధనకు ఆటం కంగా ఉన్న యాప్ లను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి జి.గిరి ధర్, జిల్లా సహాధ్యక్షులు వై.ఉమాశంకర్, పి.సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.