Share News

Teachers transfor: ఉపాధ్యాయ బదిలీలకు రెడీ

ABN , Publish Date - May 10 , 2025 | 11:44 PM

Teacher transfers ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగన్నతుల కల్పనకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10వేల మందికిపైగా ఉపాధ్యాయుల ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు.

Teachers transfor: ఉపాధ్యాయ బదిలీలకు రెడీ

  • ఉమ్మడి జిల్లాలో 10వేలకు పైగా సీనియారిటీ జాబితా సిద్ధం

  • నరసన్నపేట, మే 10(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగన్నతుల కల్పనకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10వేల మందికిపైగా ఉపాధ్యాయుల ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. పొరపాట్లు, అభ్యంతరాలు ఉంటే మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది. కమిషనర్‌ నుంచి ఆదేశాలు రాగానే తుది జాబితా ప్రకటిస్తారు. స్కూళ్ల పునర్మిర్మాణం, ఉపాధ్యాయ పోస్టుల నియామకం, ఖాళీల వివరాలను డైరెక్టర్‌ నుంచి వచ్చే ఆదేశాల మేరకు అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని కమిషనర్‌ విజయరామరాజు ఆదేశించినట్లు తెలుస్తోంది.

  • నేడో.. రేపో షెడ్యూల్‌

    ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను నేడో.. రేపో విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మోడల్‌ పాఠశాలల విషయానికి చెందిన కొన్ని జిల్లాల నుంచి మార్పులు చేయడం, అలాగే జీవో 117రద్దుకు ప్రత్యామ్నాయంగా ఉపాధ్యాయులు సర్దుబాటు విధానం తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో తర్జనభర్జన నేపథ్యంలో జాప్యమైంది. ఆదివారం ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ విడుదలకు మార్గదర్శికాలను జారీ చేయనుంది. సోమవారం నుంచి బదిలీల పక్రియ చేపట్టే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - May 10 , 2025 | 11:44 PM