Teachers transfer: మొదలైంది గురూ
ABN , Publish Date - May 22 , 2025 | 12:15 AM
Teacher Transfers Process ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. బుధవారం నుంచి వచ్చేనెల 11 వరకు ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది.
ఉపాధ్యాయుల బదిలీ పక్రియ ప్రారంభం
ముందుగా గ్రేడ్-2 హెచ్‌ఎంల స్థానచలనం
ఎస్జీటీలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్‌కు ఆమోదం
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు షెడ్యూల్ విడుదల
నరసన్నపేట, మే 21(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. బుధవారం నుంచి వచ్చేనెల 11 వరకు ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ముందుగా గ్రేడ్-2 ప్రధానోపాఽధ్యాయుల బదిలీల పక్రియ చేపట్టి.. అనంతరం స్కూల్ అసిస్టెంట్‌లకు పదోన్నతి కల్పిస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్‌లకు బదిలీలు నిర్వహిస్తారు. ఎస్జీటీలకు ఎస్‌ఏ(స్కూల్ అసిస్టెంట్‌లు)గా పదోన్నతి కల్పించి.. ఎస్జీటీలకు బదిలీల పక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు 2017 మాదిరి.. ఎస్జీటీలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఇదంతా పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి చేయనున్నారు. అలాగే జిల్లాలో ఈఏడాది కొత్తగా ఏర్పాటు చేయనున్న మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది నియమించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో 3వేల మందికి..
ఉమ్మడి జిల్లాలో సుమారు 10,850 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసినవారు 1200 మంది వరకు ఉన్నారు. పాఠశాలలు పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో మరో 1800 వరకు.. మొత్తం సుమారు 3వేల మంది ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ కానుంది. ఈ ఏడాది రెండేళ్లు సర్వీసు చేసిన వారికి బదిలీకి అవకాశం ఇచ్చారు. అలాగే ఉపాఽధ్యాయులకు ప్రాధాన్యత, బదిలీలలో మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ నెల 30న స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్‌ఎంలకు, జూన్ 5న ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్‌లకు పదోన్నతి కల్పించి.. మరుసటి రోజున ఆర్డర్లు ఇవ్వాలని షెడ్యూల్‌లో స్పష్టం చేశారు.
ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుకు సంబంధించి రెండు కాపీలు సంబంధిత డీడీలకు అందజేయాలి. గ్రేడ్-2 హెచ్‌ఎంలు అయితే డిప్యూటీ డీఈవోలకు, ఎస్‌ఏలు హెచ్‌ఎంలకు, ఎస్జీటీలు ఎంఈవోలకు అందజేయాలి. షెడ్యూల్ ప్రకారం సీనియార్టీ జాబితాలపై గ్రీవెన్స్‌ను స్వీకరించేందుకు.. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కౌంటర్‌ను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
45 గ్రేడ్-2 హెచ్‌ఎంల పోస్టులు ఖాళీ
జిల్లాలో 45 గ్రేడ్ -2 హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, అలాగే పదవీవిరమణ కారణంగా జిల్లాపరిషత్ పరిధిలో 43 పోస్టులు, మున్సిపాలటీ ప్రాంతాల్లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని స్కూల్ అసిస్టెంట్‌లకు పదోన్నతి ద్వారా భర్తీ చేయనున్నారు.
బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు తొలిరోజు సాంకేతిక చిక్కులు ఎదురయ్యాయి. బదిలీ చేసుకునే సమయంలో సర్వీసులో చేరిన తేదీ వద్ద.. ఎస్జీటీలో చేరిన తేదీ కాకుండా ఏస్‌ఏ లో చేరిన తేది మాత్రమే చూపిస్తోంది. దీంతో సర్వీసు పాయింట్లు తక్కువగా వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
షెడ్యూల్ ఇదే
=============================================================================
హెచ్‌ఎంలు ఎస్‌ఏ ఎస్జీటీలు
=============================================================================
బదిలీల దరఖాస్తుకు మే 21 నుంచి 22వరకు 21 నుంచి 24వరకు 21 నుంచి 27 వరకు
దరఖాస్తుల పరిశీలన 21 నుంచి 22 వరకు 21 నుంచి 25వరకు 21 నుంచి 28వరకు
ప్రొవిజనల్ సినియార్టీ జాబితా మే 24న 26 నుంచి 27వరకు మే 31న
జాబితాపై ఫిర్యాదుల స్వీకరణ మే 25 న మే 28న మే 28నుంచి జూన్ 1 వరకు
ఫిర్యాదులపై పరిష్కారం మే 26న మే 28నుంచి 29వరకు మే 28 నుంచి జూన్ 2 వరకు
ఫైనల్ సీనియార్టీ జాబితా మే 27న మే 31న జూన్ 6న
వెబ్‌ఆప్షన్ నమోదు మే 28న జూన్ 1,2 తేదీల్లో జూన్ 7నుంచి 10 వరకు (మ్యాన్యువల్‌గా కౌన్సిలింగ్)
బదిలీల ఆర్డర్లు జారీ మే 30న జూన్ 4 న జూన్ 11న