కార్యకర్తలకు అండగా టీడీపీ
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:08 AM
కార్య కర్తలకు ఎల్లవేళలా పార్టీ అండదండలు ఉంటాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కార్య కర్తలకు ఎల్లవేళలా పార్టీ అండదండలు ఉంటాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన గుమ్మడి యోగీశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా కింద రూ.5 లక్షల చెక్కును స్థానిక క్యాంపు కార్యాలయంలో మృతుని కుటుంబ సభ్యురాలు గుమ్మడి దేవికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.