టీడీపీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలి
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:57 PM
:టీడీపీ శ్రేణులు సమన్వయంగా, సమష్టిగా పనిచేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చా రు.మంగళవారం చిలకపాలెంలోని టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమా వేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఇంటింటికీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం బుధవారం ప్రారంభమ వుతుందని తెలిపారు.
ఎచ్చెర్ల, జూలై 1(ఆంధ్రజ్యోతి):టీడీపీ శ్రేణులు సమన్వయంగా, సమష్టిగా పనిచేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చా రు.మంగళవారం చిలకపాలెంలోని టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమా వేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఇంటింటికీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం బుధవారం ప్రారంభమ వుతుందని తెలిపారు. ప్రతిరోజూ 30 నుంచి50 ఇళ్లను సందర్శించి ఈ ఏడా ది కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా రు. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు లభిస్తుందని చె ప్పారు.కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, పార్టీ మండలాధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్, లంక శ్యామ్, కుమరాపు రవికుమార్ పాల్గొన్నారు.
ఫరణస్థలం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను మంగళవారం కలిశారు.ఈ సందర్భం గా ఎచ్చెర్ల నియోజకవర్గం సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.