Share News

టీడీపీ సభ్యత్వాలతో కార్యకర్తలకు భరోసా

ABN , Publish Date - May 08 , 2025 | 11:51 PM

దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని సభ్యత్వ భరోసా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఉందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

   టీడీపీ సభ్యత్వాలతో కార్యకర్తలకు భరోసా
సభ్యత్వ నమోదు కార్డులను అందిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, మే 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని సభ్యత్వ భరోసా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఉందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. పట్టణంలోని 9, 10, 11 వార్డుల్లో ఇటీవల సభ్యత్వం తీసుకున్న టీడీపీ కార్యకర్తలకు గురువారం ఆయన గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రవికుమార్‌ ఇంటింటికీ వెళ్లి కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కార్యకర్తలకు అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఆలోచనతో బీమా ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యకర్తలు ప్రమాదాలకు గురైనా, మరణించినా.. బీమా సౌకర్యం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ కార్య క్రమంలో వార్డు ఇన్‌చార్జి ఎన్ని శ్రీదేవి, టీడీపీ నాయకులు తంగి గురయ్య, గొల్లపల్లి సింహాద్రి, నాగల మురళీధర్‌ యాదవ్‌, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణిస్తే కీర్తి ప్రతిష్ఠలు

సరుబుజ్జిలి, మే 8 (ఆంధ్రజ్యోతి): యువత విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకోవచ్చునని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. పురుషోత్తపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కిల్లి అప్పలనాయుడు మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్‌ మాట్లాడుతూ క్రీడలతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, టీడీపీ నాయకులు అంబళ్ల రాంబాబు, తాడేల రాజారావు, కిల్లి సిద్ధార్థ, కిల్లి లక్ష్మణరావు, శేషు, లక్ష్మి, గోవింద, జగన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:51 PM