Share News

అనారోగ్యంతో టీడీపీ నాయకుడి మృతి

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:29 AM

టీడీపీ సీనియర్‌ నాయకులు త్రిపురాన వెంకట్రావు (ప్రెస్‌ వెంకట్రావు) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు.

అనారోగ్యంతో టీడీపీ నాయకుడి మృతి
నరసన్నపేట: వెంకట్రావు అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే రమణమూర్తి, టీడీపీ నాయకులు

  • పార్టీ జెండా కప్పి నివాళులర్పించిన ఎమ్మెల్యే రమణమూర్తి

నరసన్నపేట, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నాయకులు త్రిపురాన వెంకట్రావు (ప్రెస్‌ వెంకట్రావు) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో చురుకైన పాత్ర పోషించేవారు. ఈయన నిర్వహించిన ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే కొన్నాళ్లు టీడీపీ కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహించేవారు. వెంకట్రావు మృతి పార్టీక తీరని లోటని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పార్టీ జెండా వెంకట్రావు మృతదేహంపై నివాళులర్పించారు. టీడీపీ నాయకులు పీస కృష్ణ, జామి వెంకట్రావు పాడి మోసారు. నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, నాయకు లు పుచ్చల విశ్వేశ్వరరావు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

చికిత్స పొందుతూ వృద్ధుడు..

బూర్జ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గుత్తావల్లి గ్రామానికి చెందిన ఇసుకపాలెం అప్పయ్య(76) శ్రీకా కుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడని ఎస్‌ఐ ప్రవల్లిక తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు.. అప్పయ్య గురువారం రా త్రి 9 గంటల సమయంలో గడ్డి మందు తాగి అప స్మారక స్థితిలోకి వెళ్లాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు తొలుత గుత్తావిల్లి పీహెచ్‌సీకి.. అక్కడి నుం చి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

ఆమె కొండభీంపురం వాసి?

సంతబొమ్మాళి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మండల పరిధి నౌపడ పరిస రాల్లో గురువారం గుర్తించిన ఓ గుర్తుతెలియని మృతదేహం టెక్కలి మండలం కొండభీంపురం గ్రామానికి చెందిన వివాహిత దాసరి పుష్పలతగా తెలుస్తుంది. భార్యభర్తల మధ్య గత కొన్నేళ్లుగా మనస్పర్థలు రావడంతో ఆరు నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. ఈ నేపఽథ్యంలో పుష్పలతది హత్యేనని అనుమానిస్తున్నారు. దీంతో ఆమె భర్త బాలకృష్ణను పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. కాగా దీనిపై నౌపడ పోలీసులు సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Nov 22 , 2025 | 12:29 AM