central minister: 40ఏళ్లు టీడీపీదే అధికారం
ABN , Publish Date - May 22 , 2025 | 12:09 AM
Telugu Desam Party 40 Years of Power కార్యకర్తల మనోధైర్యంతో రాష్ట్రంలో టీడీపీ మరో 40 ఏళ్లు అధికారం దిశగా పయనిస్తుందని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
ఆమదాలవలస, మే 21(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల మనోధైర్యంతో రాష్ట్రంలో టీడీపీ మరో 40 ఏళ్లు అధికారం దిశగా పయనిస్తుందని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమదాలవలసలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి కేంద్రమంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేంద్రమం త్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాం. నాగావళి, వంశధార నదుల నుంచి కాలువల ద్వారా సాగునీటిని పుష్కలంగా అందించేలా చర్యలు చేపడుతున్నాం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జిల్లాలో పరిశ్రమలస్థాపనకు కృషి చేస్తున్నామ’ని తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యమని స్పష్టం చేశారు.
అభివృద్ధిని అడ్డుకుంటే తాటతీస్తా : ఎమ్మెల్యే రవికుమార్
‘ఆమదాలవలసలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కొంతమంది కుతంత్రాలు చేస్తున్నారు. అటువంటి వారి తాట తీస్తాన’ని ఎమ్మెల్యే రవికుమార్ హెచ్చరించారు. నియోజకవర్గంలో అభివృద్ధిని చూడలేని కొంతమంది వైసీపీ చోటా నాయకులు ప్రతి సోమవారం గ్రీవెన్స్‌కు వెళుతున్నారని, వారికి కష్టం లేకుండా శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించే ప్రజాదర్బార్‌లో తమ సమస్యలపై అర్జీలు ఇవ్వవచ్చునని తెలిపారు. తెలుగుజాతి ఉన్నంతవరకు.. టీడీపీ ఉంటుందన్నారు. కార్యకర్తలు గ్రూప్‌లు, మౌనం, అలకలు మాని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. వైసీపీ వక్రబుద్ధి ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చం ద్రశేఖర్‌యాదవ్, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, నాలుగు మండలాలు, పట్టణ పార్టీ అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్, మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.