Share News

టీడీపీలో పదవుల పండగ

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:10 AM

జిల్లా టీడీపీలో జోష్‌ నెలకొంది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేసేం దుకు ఏర్పాటు చేసిన క్లస్టర్‌, యూనిట్‌, గ్రామ, బూత్‌ లెవెల్‌ కమిటీల ప్ర మాణ స్వీకారం గురువారం చేపట్టారు. జిల్లాలోని పలు నియోజకవర్గా ల్లో ఎమ్మెల్యేలు, పార్టీ పరిశీలకులు వారితో ప్రమాణం చేయించారు.

టీడీపీలో పదవుల పండగ
అరసవల్లి: బాధ్యతలు చేపట్టిన పాండ్రంకి శంకర్‌ తదితరులను సత్కరిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

జిల్లా టీడీపీలో జోష్‌ నెలకొంది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేసేం దుకు ఏర్పాటు చేసిన క్లస్టర్‌, యూనిట్‌, గ్రామ, బూత్‌ లెవెల్‌ కమిటీల ప్ర మాణ స్వీకారం గురువారం చేపట్టారు. జిల్లాలోని పలు నియోజకవర్గా ల్లో ఎమ్మెల్యేలు, పార్టీ పరిశీలకులు వారితో ప్రమాణం చేయించారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బడుగు, బలహీ నవర్గాల అభ్యున్నతి కోసం ఏర్పడిన టీడీపీకి పార్టీ కార్యకర్తలే పునాది అని, దీనిని బలోపేతం చేయాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌, పార్టీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు అన్నారు. గురువారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో నియోజకవర్గం లోని అన్ని మండల క్లస్టర్‌, యూనిట్‌, గ్రామ కమిటీ బూత్‌ కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కమిటీల సభ్యులతో పార్టీ పరిశీలకుడు బుద్దా నాగ జగదీశ్వరరావు ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఆనెపు రామకృష్ణనాయుడు, మున్సిపల్‌ మాజీ చైర్‌ప ర్సన్‌ తమ్మినేని గీతా విద్యాసాగర్‌, నాయకులు మొదలవలస రమేష్‌, తమ్మినేని చంద్రశేఖర్‌, చాపర సుధాకర్‌ తదిత రులు పాల్గొన్నారు.

శ్రమించిన వారికి సముచిత స్థానం: ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం శ్రమించిన వారికి సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. నగరం లోని 80 అడుగుల రోడ్డులో గల పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం టీడీపీ పట్టణ, రెండు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, యూనిట్‌, క్లస్టర్‌, గ్రామ, బూత్‌ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. నగర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన పాండ్రంకి శంకర్‌ను ప్రత్యేకంగా అభినం దించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు చింతల రామకృష్ణ, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కోరాడ హరగోపాల్‌, నేతలు పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్‌, గొండు జగపతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీకి చేసిన సేవలతోనే గుర్తింపు: విప్‌ అశోక్‌

కవిటి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): టీడీపీకి చేసిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. రామయ్య పుట్టుగలో గురువారం పార్టీ మండల, బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం పేదల అభ్యున్నతికే పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్‌ మణిచంద్ర ప్రకాష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాసుదేవ్‌ ప్రదాన్‌, మండల మహిళా అధ్యక్షురాలు దేవికా జెన్నా, వివిధ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

పార్టీని బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే బగ్గు

నరసన్నపేట, నవంబరు 13(ఆంద్రజ్యోతి): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకరణోత్సవం నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండా ఎగురువేసి అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలతో నివాళలర్పించారు. తెలుగు యువత నియోజవర్గ అధ్యక్షుడిగా రావాడ గణపతిరావు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకు కోయిలాడ వెంకటేశ్వరరావు, నియోజవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన తదితరులు పాల్గొన్నారు.

పోలాకి: ఈదులవలస కల్యాణ మండపంలో గురువారం టీడీపీ బూత్‌, క్లస్టర్‌, కమిటీ సభ్యుల, ప్రమాణ స్వీకారోత్సవం ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి సమక్షంలో జరిగింది. నియోజవర్గస్ధాయిలో జరిగిన సమావేశంలో నాలుగు మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎంవీ నాయుడు, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, నాయకులు నల్లాన వెంకునాయుడు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ ప్రగతికి కమిటీలే కీలకం: మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రగతికి కమిటీలే కీలకమని టెక్కలి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, మాజీ ఎమ్మె ల్యే కొండపల్లి అప్పలనాయుడు (కేఏ నాయుడు) అన్నారు. గురువారం స్థానిక ఎన్టీఆర్‌ భవనంలో నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన మండల, క్లస్టర్‌, యూనిట్‌, గ్రామ, బూత్‌ స్థాయి కమిటీలకు నియమితులైన వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది కార్యకర్తలే అన్నారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ఆవరణలో టీడీపీ జెండాను అవిష్కరించి, ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు విగ్రహా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి, బాడాన రవణమ్మ, నాయకులు బోయిన రమేష్‌, పినకాన అజయ్‌కుమార్‌, వెలమల కామేశ్వరరావు, సాసుమంతు ఆనంద్‌, కర్రి అప్పారావు, నంబాల్ల శ్రీనివాస్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:10 AM