5.34 లక్షల ఇళ్లకు కుళాయిలు
ABN , Publish Date - May 17 , 2025 | 11:43 PM
జిల్లాలో జలజీవన్‌మిషన్‌లో 5.34 లక్షల ఇళ్లకు ఇంటింటా కుళాయిల ద్వారా తాగునీరందిస్తామని గ్రామీణ నీటిసరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) ఎస్‌ఈ షాన్ భాష తెలిపారు.శనివారం నరసన్నపేట ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 1793 పనులను సకాలంలో ప్రారంభించకపోవడంతో రద్దు చేసి రీ టెండర్లను పిలిచామని, వీటిలో 800 పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు.
నరసన్నపేట, మే 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలజీవన్‌మిషన్‌లో 5.34 లక్షల ఇళ్లకు ఇంటింటా కుళాయిల ద్వారా తాగునీరందిస్తామని గ్రామీణ నీటిసరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) ఎస్‌ఈ షాన్ భాష తెలిపారు.శనివారం నరసన్నపేట ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 1793 పనులను సకాలంలో ప్రారంభించకపోవడంతో రద్దు చేసి రీ టెండర్లను పిలిచామని, వీటిలో 800 పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు.మొదటివిడతలో 2.12 లక్షలు ఇళ్లుకు ఇంటింటా కొళాయిలు వేశామని చెప్పారు.వంశధార బ్యారేజీ నుంచి తాగునీరును జిల్లా అంతటా తరలించేందుకు రూ.3300 కోట్లతో పనులు ప్రతిపాదన చేశామన్నారు. నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం,ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులకు అనుసంధానంచేసి వేసవిలో తాగునీరందిస్తామని తెలిపారు. ఇప్పటికే పలాస,ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోగలగ్రామాలకు తాగునీరందిస్తున్నామ ని చెప్పారు.నరసన్నపేటలో జేజేఎం రెండోవిడతలో 9.06 కోట్లతో ఇంటింటా కొళాయిలు వేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఈ రంగప్రసాద్, డీఈఈ సుదర్శనరావు పాల్గొన్నారు.