ఏపీఆర్‌డీసీ ఫలితాల్లో పేట విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - May 14 , 2025 | 11:59 PM
ఏపీఆర్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల) పరీక్ష ఫలితాల్లో నరసన్నపేట విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
-రాష్ట్రస్థాయిలో ఒకటి, మూడు ర్యాంకుల కైవసం
నరసన్నపేట, మే 14(ఆంధ్రజ్యోతి): ఏపీఆర్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల) పరీక్ష ఫలితాల్లో నరసన్నపేట విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ప్రవేశానికి సంబంధించి బుధవారం విడుదలైన ఫలితాల్లో పట్టణంలోని కంబకాయి జంక్షన్ వద్ద ఉంటున్న అడపా విజయ్ ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. 150 మార్కులకు గాను 103 మార్కులు పొందాడు. అలాగే సారవకోట పట్టణానికి చెందిన వి. జ్ఞానరూపేష్ శర్మ ఎంపీసీ విభాగంలో మూడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 150 మార్కులకు గాను 101 మార్కులు సాఽధించాడు.
విజయ్ పదోతరగతి వరకు నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. పదిలో 547 మార్కులు పొందాడు. నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీయట్ చదివి 968 మార్కులు సాఽధించాడు. తండ్రి సింహాచలం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి లక్ష్మి గృహిణి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేరి, సివిల్ సర్వీసు పరీక్షలు రాసేందుకు తనకు ఆసక్తి ఉన్నట్లు విజయ్ తెలిపాడు.
జ్ఞాన రూపేష్ శర్మ పదోతరగతి వరకు సారవకోటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివి 567 మార్కులు, ఇంటర్ నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదివి 984 మార్కులు సాధించాడు. తండ్రి కృష్ణ సాయిరాం పురోహితుడిగా పనిచేస్తున్నారు. తల్లి ప్రసన్నదేవి గృహిణి.