జాతీయ సమైక్యతా శిబిరంలో ప్రతిభ
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:29 PM
హర్యానా రాష్ట్రం మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన జాతీయ సమై క్యతా శిబిరంలో డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ బృందం పాల్గొని ప్రతిభ కనబరిచింది. వివిధ విభాగాల పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడంతో సోమవారం వర్సిటీలో వారిని వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని అభినం దించారు.
విద్యార్థులను అభినందించిన వీసీ రజని
ఎచ్చెర్ల, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): హర్యానా రాష్ట్రం మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన జాతీయ సమై క్యతా శిబిరంలో డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ బృందం పాల్గొని ప్రతిభ కనబరిచింది. వివిధ విభాగాల పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడంతో సోమవారం వర్సిటీలో వారిని వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని అభినం దించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, విశిష్టత, ఆచార వ్యవహారాల్లో వర్సిటీ బృంద ప్రతినిధులు ప్రశంసలు అందుకున్నారు. జి.స్రవంతి (కూచిపూడి), ఎస్.భార్గవి (దేశ సంకల్ప్ స్కిట్), క్రీడా విభాగంలో కె.పవన్ బృందం, ఎం.పవిత్ర, జి.రవితో కలిసి టగ్ ఆఫ్ వార్ ఈ వెంట్, జి.చంద్రశేఖర్ (గిరిజన సంప్రదాయ వస్త్రధారణ) చేపట్టి ఆహూతులను ఆకట్టుకు న్నారు. ఈ బృందానికి నేతృత్వం వహించి జాతీయస్థాయిలో ఉత్తమ టీమ్ లీడర్‌గా, కంటిజెంట్ లీడర్‌గా అవార్డులు అందుకున్న పీవో డాక్టర్ కె.కరుణా నిధిని వీసీ అభినం దించారు. జాతీయ స్థాయిలో వర్సిటీకి పేరు ప్రతిష్ఠలు తీసుకురావడం ఆనందంగా ఉంద న్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఎం.అనూరాధ, డాక్టర్ సీహెచ్ రాజశేఖరరావు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.వనజ, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.అరుణకుమారి, పీవోలు టి.భవాని, బి.వ్యాసగీత పాల్గొన్నారు.