Share News

సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:06 PM

తమ వార్డులో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలోని 20వ వార్డు రత్తకన్న మహిళలు కోరారు.ఈ మేరకు ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌కు రామయ్యపుట్టుగలో కలిసి ఆదివారం వినతిపత్రం అందజేశారు.

సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి
అశోక్‌కు వినతిపత్రం అందజేస్తున్న మహిళలు :

ఇచ్ఛాపురం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): తమ వార్డులో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలోని 20వ వార్డు రత్తకన్న మహిళలు కోరారు.ఈ మేరకు ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌కు రామయ్యపుట్టుగలో కలిసి ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మునిసిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి వార్డు పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండాపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ పితాంబర్‌, సీహెచ్‌ బుడ్డెమ్మ, కె.లక్ష్మి, కె.రఘురామ్‌, సాయమ్మ, దర్గాసి లక్ష్మమ్మ, మట్ట విమల, కె.లలిత పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:06 PM