Share News

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠినచర్యలు తీసుకోండి

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:56 PM

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠినచర్యలు తీసుకోండి
హైకోర్టు న్యాయమూర్తికి పూలమొక్క అందిస్తున్న ఎస్పీ

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐ లు, ఎస్‌ఐలతో కేసుల దర్యాప్తు, పురోగతి, ముద్దాయిల అరెస్టు తదితర అంశాలపై నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపరిష్కృతంగా ఉన్న ముఖ్యమైన గ్రేవ్‌ కేసులు, మహిళలకు సంబంధించిన కేసులపై దృష్టి సారించి వేగవంతం చేసి దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, ఈవ్‌టీజింగ్‌, పోక్సో కేసులు, బాల్య వివాహాలు, సామాజిక మాధ్యమాల నేరా లపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల న్నారు. గంజాయి నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, గంజాయి కేసుల్లో అరెస్టయిన నిందితులపై నిరంతర నిఘా పెట్టాలన్నారు. వాహనాల తనిఖీ చేస్తూ జిల్లాలో పూర్తి స్థాయిలో అక్రమ రవాణాను అరిక ట్టాలన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో పట్టుబడిన వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేయాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్‌పై దృష్టి కేంద్రీకరించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ విచారణ చేసి బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేకూర్చాల న్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది తప్పనిస రిగా గ్రామ సందర్శన చేయాలని, ప్రజలతో మమేకమై గ్రామాల్లోని సమస్యలను గుర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించి ప్రాథమిక స్థాయిలో ఉన్న వారిని ముందస్తుగా బైండోవర్‌ చేయా లన్నారు. సమావేశంలో ఏఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీని వాసరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు జడ్జిని కలిసిన ఎస్పీ

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పోర్టు ఫోలియో హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి శ్రీకాకుళం వచ్చిన సందర్భంగా పోలీసు అతిథి గృహంలో శనివారం ఎస్పీ మహే శ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి ని జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన రిప్రజెంటేషన్‌కు స్పందించి జిల్లా కోర్టు ప్రాంగణంలోని పలు కోర్టులకు న్యాయమూర్తుల నియామ కం, కోర్టు ప్రాంగణంలోని సమస్యలను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తంగి శివప్రసాద్‌, కార్యదర్శి పిట్ట దామోదర రావు, సీనియర్‌ న్యాయవాదులు తర్లాడ రాధాకృష్ణ, వాన కృష్ణచంద్‌, ఎన్ని సూర్యారావు, మామిడి క్రాంతి, జి.భాగ్యలక్ష్మి, భవానీ ప్రసాద్‌ తదితరులున్నారు.

Updated Date - Sep 20 , 2025 | 11:56 PM