irrigation water సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి
ABN , Publish Date - May 29 , 2025 | 11:40 PM
వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు.
టెక్కలి, మే 29 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు. గురువారం టెక్కలిలో వంశధార డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కాలువ, చెరువుగట్లు ఎక్కడ బలహీ నంగా ఉన్నాయో గుర్తించి అవసరమైతే యుద్ధప్రాతిపదికన పటిష్ఠం చేయించాలన్నా రు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సాగు నీరందించేలా ముందస్తు చర్యలు చేపట్టాల న్నారు. సమావేశంలో వంశధార ఈఈ బి.శేఖ రరావు, డీఈఈలు కె.శ్రీధర్, ఎస్.శ్రీనివాస రావు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.