Share News

జీడి పంట అభివృద్ధికి చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:29 PM

ఉద్దానం ప్రాంతంలో జీడిపంట అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

జీడి పంట అభివృద్ధికి చర్యలు తీసుకోండి
ఎమ్మెల్యే అశోక్‌కు వినతిపత్రం ఇస్తున్న ఉద్దానం రైతులు

కవిటి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాంతంలో జీడిపంట అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ బి.అశోక్‌ను మంగళ వారం రామయ్యపుట్టుగలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ ప్రాంతంలో జీడిపంట దిగుబడి తక్కువ గా ఉందన్నారు. కొత్తరకం ఎం-23జీడి రకాన్ని రాష్ట్రంలో వచ్చేలా కృషి చేయాలని కోరారు. జీడి తోటల పునరుద్ధరణకు నాణ్యమైన విత్త నాలు వచ్చేలా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎ.అనిల్‌, బి.జయకృష్ణ, బి.వెంకట రావు, బి.విజయకృష్ణ పాల్గొన్నారు.

మండపల్లిలో సమస్యలు పరిష్కరించండి

కంచిలి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మండపల్లి పంచాయతీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామా రావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో గ్రామస్థులు డి.కేశవరావు, డి.కవిబాబు తదితరులున్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:29 PM