Share News

తుఫాన్‌ అనంతర చర్యలు తీసుకోండి: అశోక్‌

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:00 AM

తుఫాన్‌లో నష్టపోయిన వారి ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించిందని విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు.

తుఫాన్‌ అనంతర చర్యలు తీసుకోండి: అశోక్‌
అధికారులతో మాట్లాడుతున్న విప్‌ బెందాళం అశోక్‌

ఇచ్ఛాపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌లో నష్టపోయిన వారి ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించిందని విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. తుఫాన్‌ వల్ల ఎటువంటి నష్టం జరిగిందో నివేదిక అందజేయాలన్నారు. అన్ని గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులు చేపట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. నష్టపోయిన పంటలను అంచనా వేయాలన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ దాసరి రాజు, మండల ప్రత్యేకాధికారి సీహెచ్‌ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ ఎన్‌. వెంకటరావు, ఎంపీడీవో ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్‌ ప్రభావిత మత్స్యకార గ్రామమైన డొంకూరు గ్రామాన్ని బుధవారం ఎమ్మె ల్యే బెందాళం అశోక్‌ సందర్శించారు. కాజ్‌వే పై నిలిచిలోనుంచి నడుచు కుంటూ వెళ్లి గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్నారు. జగన్నాఽథపురం గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి సదుపాయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సీఐ ఎం.చిన్నమనాయుడు, టీడీపీ నేతలు పి.తవిటయ్య, ఎన్‌.కోటి, ఎస్‌.డిల్లీ, కాళ్ల దిలీప్‌, ఎన్‌.జాని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 12:00 AM